దటీజ్ మెగాస్టార్..పేదరోగులకు ఉచిత ప్లాస్మా సరఫరా.!

Published on Sep 29, 2020 12:06 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆన్ స్క్రీన్ పై రీల్ హీరోగానే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో రియల్ హీరోగా కూడా ఎన్నో మన్ననలు పొందారు. ఎంతోమందికి సాయం అందించిన మెగాస్టార్ పెద్ద మనసు ఇపుడు మరోసారి ఆవిష్కృతమయ్యింది. చిరు గత తొమ్మిదేళ్ల పాటు తన సొంత నిధులతో ఏర్పరు చేసిన బ్లడ్ మరియు ఐ బ్యాంకుతో ఎంతోమంది ప్రాణ దాతగా నిలిచారు.

అంతే కాకుండా ఇటీవలే కబళించిన కరోనా ధాటికి మరెందరో సినీ కార్మికులు నిస్సహాయులు అయ్యారు. ఈ సందర్భంగా వారికి కూడా అండగా నిలబడ్డారు. ఇపుడు మరోసారి ముందడుగు వేసి కరోనా బారిన పడి నిస్సహాయులైన పేద రోగులకు ఉచిత ప్లాస్మా ను తన బ్లడ్ బ్యాంకు ద్వారా వితరణ చేసేందుకు పూనుకున్నారు.

తెల్ల రేషన్ కార్డులు, ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పేద రోగులకు ఉచితంగా తన బ్లడ్ బ్యాంక్ ద్వారా సరఫరా చేస్తున్నామని దీనిని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చిరు తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో ప్లాస్మా దొరక్క పేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ ఇపుడు చిరు అండగా నిలిచి భరోసా ఇచ్చారు. ఇలాంటి అంశాలు చాలవా ఆయన్ను దటీజ్ అని చెప్పడానికి.

సంబంధిత సమాచారం :

More