‘మా’ ఎన్నికలు వెంటనే జరపాలి – చిరంజీవి

‘మా’ ఎన్నికలు వెంటనే జరపాలి – చిరంజీవి

Published on Aug 9, 2021 9:03 PM IST

Chiranjeevi 1

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి మా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఎన్నికలను మరింత హీట్ పుట్టిస్తున్నారు. ఇటీవల ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌పై హేమ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

దీంతో తొలిసారి మా ఎన్నికలపై స్పందించిన మెగస్టార్ చిరంజీవి ‘మా’ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాశారు. ఎన్నికలు వెంటనే జరపాలని, ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని అన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా’ ప్రతిష్ట దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని లేఖలో తెలిపారు.

తాజా వార్తలు