మెగాస్టార్ గొప్ప మనసు..ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబానికి ఆర్ధిక సాయం.!

Published on Jul 6, 2022 8:00 pm IST

ఈరోజు తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర తీరని విషాదం చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా దగ్గర 800 కి పైగా సినిమాలను ఎడిటింగ్ చేసిన ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్యంతో ఈరోజు కన్ను మూసారు. దీనితో ఆయనతో వర్క్ చేసిన ఎంతోమంది స్టార్ నటులు సోషల్ మీడియాలో తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండగా..

మెగాస్టార్ మరోసారి తన ఉన్నతమైన మనసును చాటుకున్నారు. ఈ కష్ట కాలంలో గౌతమ్ రాజు కుటుంబానికి అండగా తక్షణ సాయంగా 2 లక్షల రూపాయలు అందజేశారు. మరి ఈ మొత్తాన్ని టాలీవుడ్ ప్రముఖులు తమ్మా రెడ్డి భరద్వాజ తో పంపి వారి కుటుంబానికి అందేలా చేశారు. ఇలాంటి కొన్ని ఆకస్మిక పరిస్థితుల్లో చిరు ఎన్నోసార్లు ఇలా స్పందించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా మరోసారి తన గొప్పమనసు మెగాస్టార్ చాటుకున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :