మెగాస్టార్ చిరంజీవి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం కోసం తొలి సమరం ప్రారంభించిన వీరుడి కథ కావడం, ఆ పోరాటం కోసం ప్రాణాల్నే అర్పించడంతో ‘సైరా’ చిత్రం ఒక దేశభక్తుడి చిత్రంగా పేరు తెచ్చుకుంది. సినిమా చూసిన అందరూ కూడా అందరూ తప్పక చూడాల్సిన చిత్రం అంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా చిరంజీవి పలువురు ప్రముఖలను కోరుతున్న సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కలిసి ఈ చిత్రాన్ని చూడాల్సిందిగా కోరారు. వెంకయ్య నివాసంలో సైరా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. అలాగే ఈ చిత్ర ప్రదర్శనకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని, ‘సైరా’ సినిమాను వీక్షించేందుకు ఆహ్వానించడానికే ఈ మీటింగ్ అని అంటున్నారు.


