వైరల్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రసంశలు

Published on Dec 3, 2022 12:00 am IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఎన్టీఆర్ తో కలిసి నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎంతో పెద్ద ఘన విజయం అందుకున్న విషయం తెలిసిందే. చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర చేయగా ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించారు. ఇక ప్రస్తుతం శంకర్ తో ఒక భారీ మూవీ చేస్తున్నారు చరణ్. వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే విషయం ఏమిటంటే, నేడు ప్రఖ్యాత నేషనల్ ఛానల్ ఎన్ డి టివి వారి అవార్డుల కార్యక్రమంలో రామ్ చరణ్ కి ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు లభించింది. కాగా ఈ కార్యక్రమంలో ఆయనని ట్రూ లెజెండ్ అవార్డుతో వారు సత్కరించారు. ఇక ఇంతటి గొప్ప అవార్డు లభించడం పై రామ్ చరణ్ ఎమోషనల్ గా మాట్లాడారు. 1997లో తమ కుటుంబానికి చెందిన ఫామిలీ ఫ్రెండ్ ఒకరు సకాలంలో రక్తం అందకపోవడంతో మరణించిన ఘటన తాను ఎప్పటికీ మర్చిపోలేనని, ఆ విధంగా మరెవ్వరికీ జరుగకూడదు అనే ఉద్దేశ్యంతో నాన్న చిరంజీవి గారు అభిమానుల సహకారంతో బ్లడ్ బ్యాంకు ని స్థాపించారని, రక్తదానం చేయడం ఒక గొప్ప బ్రహత్కార్యం అని అలానే బ్లడ్ బ్యాంకు లో రక్తదానం చేసిన వారితో ఫోటో దిగే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు చరణ్.

అయితే చరణ్ కి ఈ అవార్డు రావడంతో పై హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి, కొద్దిసేపటి క్రితం తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కుమారుడి పై ప్రసంశలు కురిపించారు. నాన్న నిన్ను చూస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంది, అలానే ప్రస్తుతం నువ్వు ట్రూ లెజెండ్ అవార్డు సొంతం చేసుకోవడం గర్వంగా ఉంది, భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని అవార్డులు అందుకోవాలని మేము అభిలషిస్తున్నాము అంటూ తమ ఫామిలీ ఫొటోస్ తో మెగాస్టార్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :