‘భోళా శంకర్’ కోసం ప్రత్యేక సెట్ !

Published on Mar 12, 2023 2:30 am IST

టాలెంటెడ్ డైరెక్టర్ మెహ‌ర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరూకు చెల్లెలిగా న‌టిస్తోంది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ సోమ‌వారం నుంచి ఓ ప్ర‌త్యేక సెట్‌లో జ‌ర‌గ‌నుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలుస్తోంది. ఐతే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. ఇక మెగాస్టార్ తన కెరీర్ లో ‘భోళా శంకర్’ పాత్ర కోసం పూర్తి డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు.

ఆ మధ్య చిరు కొత్త లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ లుక్ ఈ సినిమాలోదేనట. ఇక మెహ‌ర్ ర‌మేష్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ ను బాగా డిజైన్ చేశాడు. కథలోని మెయిన్ ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా వచ్చాయట. ఎంతైనా హీరోలను స్టైలిష్ గా చూపించడంలో మెహర్ రమేష్ కి మంచి టాలెంట్ ఉంది. మరీ మెగాస్టార్ ను మెహర్ రమేష్ ఎంత కొత్తగా చూపిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :