తెలుగు సినీ పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) గారు ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా, కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవి ను పద్మ విభూషణ్ అవార్డు తో సత్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ అవార్డు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అయితే నందమూరి తారక రామారావు గారికి భారతరత్న అవార్డు ను ఇవ్వాలంటూ తెలుగు సినీ అభిమానులు, ప్రజలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి సైతం తాజాగా వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని అన్నారు. అంతేకాక ఎంజీఆర్ గారికి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారికి రావడం అంతకంతా సముచితం, ఆనందదాయకం. నేను ఎదురు చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రం తో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ చిత్రం థియేటర్ల లోకి రానుంది.