సుధీర్ “మందులోడ” పాటను విడుదల చేయనున్న మెగాస్టార్ చిరు!

Published on Jul 8, 2021 12:32 am IST

సుధీర్ బాబు హీరోగా కరుణా కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 చిత్రం తో సూపర్ హిట్ కొట్టిన కరుణా కుమార్ ఈ సారి సుధీర్ బాబు తో భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులను, సినీ అభిమానులను ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాట ప్రస్తుతం విడుదల కి సిద్దం అయినట్లు తెలుస్తుంది.

ఇట్స్ మాస్ కా బాస్ సాంగ్ అంటూ సుధీర్ బాబు మందులోడ పాట అంటూ చెప్పుకొచ్చారు. మందులడ పాటను ఈ జూలై 9 వ తేదీన ఉదయం 9 గంటలకు మెగాస్టార్ చిరంజీవి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 70 ఎంఎం ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా మరియు శశి దేవిరెడ్డి కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :