మెగాస్టార్ తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేశారు – పవన్ కళ్యాణ్

Published on Jul 9, 2018 3:48 pm IST

మెగాస్టార్ చిరంజీవి 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినప్పటినుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ లోపు చిరు రాజకీయాలకి ఎందుకు దూరంగా ఉంటున్నారు అని అనేక ఊహాగానాలు వచ్చాయి. కాగా మెగాస్టార్ మాత్రం తన అభిమానుల కోరిక మేరకు తిరిగి సినిమాల్లో నటిస్తూ ‘ఖైదీ 150’తో భారీ విజయాన్ని అందుకున్నారు.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి రాజాకీయాల గురించి ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. మా అన్నయ్య చిరంజీవిగారు కూడా సునామీలా రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అన్నయ్యకు లేదు. ఆయన తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేశారు’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. చిరు భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావాలా అని అడిగినప్పుడు పవన్ ఈ విధంగా స్పందించారు.

సంబంధిత సమాచారం :