‘ప్రభాస్’ సినిమా ప్లేస్ లో మెగాస్టార్ సినిమా !

‘ప్రభాస్’ సినిమా ప్లేస్ లో మెగాస్టార్ సినిమా !

Published on Jun 28, 2022 1:00 AM IST

కమర్షియల్ డైరెక్టర్ మారుతి – పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి. పైగా ఈ సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ట్ అవుతుందని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ప్లేస్ లో మారుతి – మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చింది. కాబట్టి.. మారుతి – ప్రభాస్ సినిమా క్యాన్సిల్ అయింది అని ప్రచారం జరుగుతుంది.

ఇక మారుతి, మెగాస్టార్ తో చేయబోయే సినిమా ఒక మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అని, సబ్జెక్ట్ ఎక్కువగా స్థానికంగా ఉంటుందని, తెలుస్తోంది. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన ఎలిమెంట్స్ ను సిద్ధం చేశాడట. ఏది ఏమైనా మెగాస్టార్ మారుతికి ఛాన్స్ ఇచ్చాడు అంటే.. మారుతి రేంజ్ మారిపోయినట్టే. ఇక ప్రస్తుతం దర్శకుడు మారుతి గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు