50 రోజులు పూర్తిచేసుకున్న మెగాస్టార్ ‘సైరా’

Published on Nov 20, 2019 11:40 pm IST

భారీ అంచనాల నడుమ విడుదలైన మెగాస్టార్ చిరంజీవి యొక్క ‘సైరా’ చిత్రం నేటితో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం మెగా అభిమానుల్ని, తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. నరసింహారెడ్డి పాత్రలో చిరు నటనకు తెలుగు జనం నీరాజనాలు పట్టారు. వసూళ్ల పరంగా కూడా ఈ సినిమా అనేక చోట్ల నాన్ బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసింది.

మొత్తం 30 సెంటర్లలో సినిమా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మెగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ముఖ్యమైన సినీ కేంద్రాల్లో ఈరోజు సాయంత్రం అర్థశతదినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించారు. ఇకపోతే ప్రస్తుతం చిరు కొరటాల శివ డైరెక్షన్లో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టే సన్నాహాల్లో ఉన్నారు.

సంబంధిత సమాచారం :

More