ఈసారి పూరి మెగాస్టార్ మనసు గెలుచుకుంటాడా ?

Published on Jul 25, 2019 8:57 pm IST

మెగాస్టార్ చిరంజీవి ఇష్టపడే కమర్షియల్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ కూడా ఒకరు. ఆయనతో సినిమా చేయాలని చిరు మనసులో ఎప్పటి నుండో ఉంది. అసలు 150వ చిత్రాన్ని పూరితోనే చేద్దామని అనుకున్న చిరు కొన్ని పరిమితుల వలన వినాయక్ డైరెక్షన్లో ‘ఖైదీ నెం 150’ చేశారు. చిరు తనకు ఛాన్స్ ఇవ్వకపోయినా పూరి బాధపడలేదు. ఇప్పటికీ ఆయన రెడీ అంటే 10 రోజుల్లో కథను సిద్దం చేయగలడు.

ప్రస్తుత వాతావరణం చూస్తుంటే వారి కలయిక త్వరలోనే ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూరి డైరెక్ట్ చేసిన కొత్త చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ మాస్ ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఆ చిత్రాన్ని చూడాలనే కోరికతో చిరు ఈరోజు స్పెషల్ షో వేయించుకుంటున్నారు. చిత్రం దాదాపు చిరు అభిరుచికి చాలా దగ్గరగా ఉంటుంది.
కాబట్టి ఆయనకు తప్పక నచ్చుతుంది.

అది చూశాక చిరు పూరికి సినిమా చేద్దామనే మాటిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మెగా అభిమానులు సైతం పూరి డైరెక్షన్లో చిరుని చూడాలని ఎన్నాళ్లగానో అనుకుంటున్నారు. మరి చూడాలి పూరి కోరిక, మెగా అభిమానుల ఆకాంక్ష ఏమేరకు తీరుతాయో.

సంబంధిత సమాచారం :