మెగాఫ్యాన్స్ కోసం హీరోయిన్ ను పెడుతున్నారు !

Published on Sep 28, 2020 7:13 pm IST

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘లూసిఫర్’ రిమేక్, దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వినాయక్ ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. రచయిత ఆకుల శివతో డైలాగ్స్ రాయిస్తున్నాడట. అలాగే మరో స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా కూడా ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. అయితే ‘లూసిఫర్’ స్క్రిప్ట్ లో హీరోయిన్ రోల్ లేదు. మెగా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఓ మాస్ సాంగ్ కోసం ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను యాడ్ చేస్తున్నారు.. కాకపోతే హీరోయిన్ పాత్ర నిడివి ఎంత ఉంటుందనేది ఇంకా తెలియలేదు. హీరోయిన్ ను సాంగ్ కు మాత్రమే పరిమితం చేస్తారా లేక సీన్స్ లో కూడా ఇన్ వాల్వ్ చేస్తారా అనేది చూడాలి.

ఇక వినాయక్ కి మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చాడనగానే ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇలాంటి స్క్రిప్ట్ లను వినాయక్ బాగా
హ్యాండిల్ చేస్తారు. పైగా వినాయక్ ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. నిజానికి వినాయక్ బాలయ్య బాబుతో ఓ సినిమాని ప్లాన్ చేసాడు, అంతలో బాలయ్య, బోయపాటి సినిమా మీదకు వెళ్లడంతో ఇక వినాయక్ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో వినాయక్ కు హీరోగా చేయమని ఒక సినిమా రావడం.. దాంతో వినాయక్ కూడా యాక్టింగ్ వైపు ఆసక్తి చూపించాడు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ పిలిచి మరీ వినాయక్ కి అవకాశం ఇచ్చారు. మరి వినాయక్ ఈ అవకాశాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More