గుండెలు పిండేస్తున్న శ్రీహరి కొడుకు విన్నపం

Published on Jul 12, 2019 9:30 am IST

దివంగత హీరో శ్రీహరి కుమారుడు మేఘాంష్ శ్రీహరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం “రాజ్ దూత్” నేడు విడుదలకు సిద్ధమైంది. లవ్,కామెడీ,యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అర్జున్-కార్తీక్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా మేఘాంష్ లుక్ బాగుండడంతో పాటు,టీజర్,ట్రైలర్స్ మూవీపై అంచనాలు పెంచాయి.

కాగా ఈ యంగ్ హీరో ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ సందేశం విడుదల చేశాడు. శ్రీహరి కొడుకుగా పరిచయమవుతున్న నాపై ఎంతో బాధ్యత ఉంది. ఆయనలా మిమ్ముల్ని అలరించడానికి మీముందుకు వస్తున్నాను. ఆయనలా ఇప్పుడే బరువైన పెద్ద పాత్రలు చేయకపోయినా,భవిష్యత్తులో చేస్తాను. ఈ సినిమా చూశాక,శ్రీహరి కొడుకు బాగా చేసాడు, అని ప్రతి ఒక్కరు ఫిలయ్యేలా చేయాలని ఎంతో కష్టపడి చేశాను. ఈ మూవీ మీచేతుల్లో పెడుతున్నా, విజయం అందిస్తారని భావిస్తూ, అని కొంచెం ఎమోషనల్ విన్నపం చేశాడు. మరి ఇంతలా తన మూవీని ఆదరించండి అని వేడుకుంటున్న మేఘాంష్ అభ్యర్ధనను ప్రేక్షకులు ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :

X
More