‘గుంటూరు మిర్చి’ గా మాస్ మెహబూబ్ దిల్ సే..!

Published on Jul 29, 2021 10:05 am IST


యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా వీక్షకులకు మెహబూబ్ దిల్ సే పేరుని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అక్కడ నుంచి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన ఫేమ్ ను మరింత పెంచుకున్నాడు. అయితే ఆ తర్వాత కూడా ఆఫర్స్ తోనే తన లైఫ్ స్టైల్ ని కొనసాగిస్తున్న కెరీర్ లో మంచి ఇచ్చే వెబ్ సిరీస్ లా లేటెస్ట్ యూట్యూబ్ సిరీస్ ‘గుంటూరు మిర్చి’ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. హీరోయిక్ ఫ్రేమ్స్ తో మాస్ పర్సనాలిటీగా ఆసక్తిగా ఇందులో కనిపిస్తున్నాడు.

తాజాగా విడుదల కాబడిన టీజర్ డీసెంట్ గా ఉంది. ముఖ్యంగా సీనియర్ నటుడు సాయి కుమార్ వాయిస్ ఓవర్ లో ఈ సిరీస్ ను వివరించిన విధానం ఆకట్టుకునేలా ఒక సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ లా ఇచ్చింది. అన్ని హంగులు కూడా ఈ సిరీస్ లో ఉన్నట్టుగా ఈ టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. అలాగే ఈ టీజర్ లో ముఖ్యమైన మెన్షన్ శ్రవణ్ భరద్వాజ్ ఇచ్చిన సంగీతం అని చెప్పొచ్చు. ఇక ఈ సిరీస్ కి అనీల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించగా త్వరలోనే విడుదల కానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :