మెహ్రీన్ ఆశలన్నీ జనవరి మీదే

Published on Jan 9, 2020 2:00 am IST

గతేడాది సంక్రాంతి సీజన్లో విడుదలైన ‘ఎఫ్ 2’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది మెహ్రీన్. ఆ విజయంతో ఇకపై ఆమెకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదని అనుకున్నారు అంతా. కానీ ఈలోపే ‘చాణక్య’ రూపంలో ఎదురైన పరాజయం ఆమెకు బ్రేకులు వేసింది. దీంతో మళ్లీ పెద్ద హిట్ అవసరం ఏర్పడింది ఆమెకు.

ప్రస్తుతం ఆమె నటించిన రెండు చిత్రాలు ‘ఎంత మంచివాడవురా, అశ్వథ్ధామ’ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వీటిలో కళ్యాణ్ రామ్ జోడీగా సతీష్ వెగేశ్న డైరెక్షన్లో నటించిన ‘ఎంత మంచివాడవురా’ జనవరి 15న, నాగశౌర్యతో కలిసి చేసిన ‘అశ్వథ్ధామ’ జనవరి 31న విడుదలకానున్నాయి. ఈ రెండూ గనుక మంచి విజయాల్ని అందుకుంటే మెహ్రీన్ కెరీర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కి ఈ యేడాదిలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఆమె చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే మెహ్రీన్ తన ఆశలన్నీ ఈ జనవరి నెల మీదే పెట్టుకుని ఎదురుచూస్తోంది.

సంబంధిత సమాచారం :