మెహ్రీన్ కు మరో అవకాశం !

Published on May 10, 2019 11:21 am IST

ఈ ఏడాది ఎఫ్ 2 తో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టినా కూడా అవకాశాల కోసం వెతుక్కోవల్సిన పరిస్థితి వచ్చింది యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కి. ఈ చిత్రం తరువాత పలు పెద్ద ప్రాజెక్ట్ లలో అవకాశాలు వస్తాయని అనుకోని ఎదురుచూసిన మెహ్రీన్ కు నిరాశే మిగిలింది. అయితే ఇటీవల గోపీచంద్ -తిరు సినిమా లో ఛాన్స్ దక్కించుకున్న ఈబ్యూటీ తాజాగా మరో ఆఫర్ ను పట్టేసిందని సమాచారం.

యంగ్ హీరో నాగ శౌర్య ఓ నూతన దర్శకుడు తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయికగా నటించనుంది. నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక ప్రస్తుతం శౌర్య , శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈసినిమా ను కంప్లీట్ చేసి శౌర్య తన తదుపరి చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.

సంబంధిత సమాచారం :

More