“మెరిసే మెరిసే” మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎగ్జయిటింగ్‌గా ఉంది – శ్వేతా అవ‌స్తి

Published on Aug 7, 2021 7:00 pm IST

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా పవన్ కుమార్ కె దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మెరిసే మెరిసే’. కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మంచి స‌క్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ శ్వేతా అవ‌స్తి మీడియాతో మాట్లాడింది.

మా ‘మెరిసే మెరిసే’ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఫీలయ్యానని చెప్పుకొచ్చింది. నేను ఓ రీసెర్చ్ స్టూడెంట్‌ని, మాది పూణే. చదువుకునే రోజుల్లోనే నేడు మోడలింగ్ మొదలుపెట్టానని, ‘మళ్లీ మళ్లీ చూశా’ సినిమా ద్వారా హీరోయిన్‌గా నాకు తొలి అవకాశం వచ్చిందని, ‘మెరిసే మెరిసే’ సినిమా నాకు రెండో సినిమా. దినేశ్ తేజ్ మంచి కోస్టార్‌ అని నాకు భాష ప‌రంగా, డైలాగ్స్ చెప్పే స‌మ‌యంలో బాగా హెల్ప్ చేశాడని చెప్పుకొచ్చింది.

ద‌ర్శ‌కుడు ప‌వ‌న్‌కుమార్ మంచి టాలెంటెడ్ ఉన్న వ్యక్తి అని అతనికి తొలి సినిమానే అయినప్పటికీ చాలా క్లారిటీతో సినిమాను పూర్తి చేశాడని చెప్పింది. ఈ సినిమాలో నా పాత్రను డిజైన్ చేసిన తీరు బాగా న‌చ్చిందని అన్నారు. ఉత్త‌రాది ప్రేక్ష‌కుల కంటే ద‌క్షిణాది ప్రేక్ష‌కులు సినిమాను ఎక్కువ‌గా ప్రేమిస్తారని, ఇక్కడ వారికి సినిమా అంటే ఓ ఎమోష‌న్, సెల‌బ్రేష‌న్‌ అని చెప్పింది. ప్రస్తుతం తాను ఓ పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నానని, ఇంకా ఎన్నో మంచి సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :