చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్

Published on Jul 8, 2019 3:40 pm IST

సంగీత దర్శకుల్లో మిక్కీ జె మేయర్ స్టైల్ పూర్తిగా భిన్నం. హడావుడి లేకుండా నచ్చిన సినిమాలనే చేస్తుంటారాయన. అందుకే ఆయన చేసే ప్రతి సినిమాలో వైవిధ్యం చూపగలుగుటున్నారు. అయితే ఈ యేడాది మాత్రం ఆయన ఫుల్ బిజీగా ఉండబోతున్నారు. కారణం ఆయన చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి.

వాటిలో ఒకటి 14 రీల్స్ పతాకంపై హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘వాల్మీకి’ ఒకటి కాగా ఇంకొకటి అదే నిర్మాణ సంస్ధలో శర్వానంద్ హీరోగా మొదలైన ‘శ్రీకారం’ చిత్రానికి కూడా మిక్కీయే సంగీతం చేస్తున్నారు. ఇక ఈ రెండూ కాకుండా దిల్ రాజు నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రానికి కూడా ఆయనే స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ యేడాది ఇప్పటికే ‘ఓ బేబి’తో సాలిడ్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు మిక్కీ.

సంబంధిత సమాచారం :

More