ఆర్య “వెబ్ సిరిస్” కి డైరెక్టర్ ఫిక్స్!

Published on Aug 1, 2021 2:36 pm IST


తమిళ నటుడు ఆర్య ఓటిటి ద్వారా ఇటీవల ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అయిన సార్పట్ట పరంపర తెలుగు, ఇతర భాషల్లో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఆర్య మెయిన్ లీడ్ గా అమెజాన్ ప్రైమ్ ఒక వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకు సంబంధించిన వార్తలు సైతం సోషల్ మీడియాలో వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆ వెబ్ సిరీస్ ను ఎవరు డీల్ చేయబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

అయితే ఈ వెబ్ సిరీస్ కి మిలిండ్ రావు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ త్వరలో షూటింగ్ పనులను మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ సిరీస్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :