గోపీచంద్ కు జోడీగా మిల్కీ బ్యూటీ !

Published on Jan 31, 2019 8:39 am IST

మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం తిరు దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ రాజస్థాన్ లోని జై సల్మేర్ లో జరుగనుంది. 45 రోజులపాటు జరుగనునున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ను తీసుకోవాలనుకుంటున్నారు. తమన్నా కూడా ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే నిజమైతే గోపిచంద్ సరసన మొదటి సారీ నటిచనుంది. త్వరలోనే ఈ విషయం ఫై క్లారిటీ రానుంది.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై సుమారు 35కోట్ల బడ్జెట్ తో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈచిత్రానికి పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :