రీల్ విలన్..రియల్ హీరోకి వెల్లువెత్తుతున్న విషెష్.!

Published on Jul 30, 2021 6:35 pm IST

ఇప్పుడు భారతదేశం అంతా కూడా తెలియకుండా ఉండని పేరు సోనూ సూద్.. అవ్వడానికి విలన్ గానే సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయినా ఒక రియల్ లైఫ్ హీరోగా ఇప్పుడు భారత దేశ ప్రజలకు అవతరించాడు. ఇప్పటి వరకు ఎన్నో వందల సినిమాల్లో విలన్ గా తన విలనిజాన్ని చూపించి ఆకట్టుకున్న సోనూ సూద్ గత ఏడాది కరోనా సంక్షోభంలో ఒక్కడై ఎంతో చేసి చూపించాడు. అందుకే ఇప్పుడు ఆనతి కాలంలోనే ఆపద్బాంధవుడిలా మారాడు.

మరి అలాంటి సోనూ జన్మదినం నేడు కావున మొత్తం దేశ వ్యాప్తంగా సినీ ప్రముఖులు సహా ప్రేక్షకులు తమ ప్రేమాభిమానాలతో కూడైన జన్మదిన శుభాకాంక్షలను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికీ కూడా ఎంతో మందికి కరోనాకి అతీతంగా సేవలు అందిస్తూ వస్తుండడం సోనూ సూద్ వ్యక్తిత్వం ఎంతోమందికి అత్యంత స్ఫూర్తిదాయకం. మరి ఇలా ఎంతో మందికి సాయం అందిస్తున్న ఈ రియల్ హీరో ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మా 123తెలుగు టీం ఆకాంక్షిస్తూ.. సోనూ సూద్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

సంబంధిత సమాచారం :