యూత్ ఫుల్ లవ్ స్టొరీతో ‘మిస్ మ్యాచ్’ !

యూత్ ఫుల్ లవ్ స్టొరీతో ‘మిస్ మ్యాచ్’ !

Published on Nov 16, 2019 3:09 PM IST

mis match

ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లు గా ‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది.

ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను విడుదల అవ్వనుంది. కాగా ఈ సినిమా రెండు కుటుంభాల మధ్య జరిగే కథ అట. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ఇటు యూత్ ఫుల్ లవ్ స్టొరీ కూడా సినిమాలో ప్రధానంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. హీరో ఉదయ్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు క్లీన్ యు సట్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ‘మిస్ మ్యాచ్’ బాక్సాఫీస్ కి ఎంతవరకు మ్యాచ్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు