రామ్ సినిమాలో మిస్ ఇండియా బ్యూటీ

రామ్ సినిమాలో మిస్ ఇండియా బ్యూటీ

Published on Dec 9, 2015 8:18 PM IST

nenu-sailaja
‘శివమ్’ సినిమా నిరాశ పరిచిన తర్వాత యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నుంచి వస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ‘నేను శైలజ’. రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాని ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కింది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి ఫీల్ గుడ్ రిపోర్ట్ వచ్చింది. నేను శైలజ కాన్సెప్ట్ చాలా ఫ్రెష్ గా ఉంటుందని రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఉండవని రామ్ తెలిపాడు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ కాకుండా.. మరో హీరోయిన్ కి కుడా అవకాశం ఉంది. ఆ పాత్ర కోసం 2015 మిస్ ఇండియన్ కంటెస్స్టంట్ తన్య హోప్ ని సెలక్ట్ చేసారు. ఈ సినిమాలో తను ఎక్కువ సేపు కనిపించదు కానీ తన పాత్ర సినిమాకి చాలా కీలకం అని అంటున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఆడియో కోసం డిసెంబర్ 12వ తేదీని ఫిక్స్ చేయగా, రిలీజ్ కోసం మేము ముందుగా చెప్పినట్టుగానే 2016 జనవరి 1ని ఫిక్స్ చేసారు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి స్రవంతి రవికిషోర్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు