ట్రెండీగా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” ఫస్ట్ సింగిల్.!

Published on Mar 22, 2023 2:00 pm IST


మన టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి బాహుబలి తర్వాత చాలా తక్కువ సినిమాల్లోనే కనిపించడం జరిగింది. మరి ఈ చిత్రాల తర్వాత అయితే కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకొనే చేసిన సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” చిత్రం. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా మహేష్ బాబు పచ్చిగోళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మంచి బజ్ తో ఉంది.

ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ని ఉగాది కానుకగా రిలీజ్ చేయగా ఇది మంచి ట్రెండీ గా ఉందని చెప్పాలి. మరి ఈ సాంగ్ ని మాన్సి ఆలపించగా ఈ సాంగ్ లో అనుష్క రోల్ ని రిప్రెజెంట్ చేస్తూ ఉన్న లిరిక్స్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. అంతే కాకుండా అనుష్క లుక్స్ అయితే అభిమానులకి చాలా కాలం తర్వాత మంచి ట్రీట్ అని కూడా చెప్పాలి. అలాగే రాధన్ ఇచ్చిన బీట్స్ కూడా బాగున్నాయి. ఇలా మొత్తానికి అయితే ఫస్ట్ సింగిల్ హిట్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ వచ్చే ట్రాక్స్ ఎలా ఉంటాయో చూడాలి.
సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :