తాప్సీ మూవీలోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ నటుడు..!

Published on Aug 5, 2021 1:55 am IST

టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ బిజీ అయిన తాప్సీ దాదాపు 3 సంవత్సరాల తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తుంది. “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” సినిమాతో మంచి హిట్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వరూప్ ఆర్‌.ఎస్‌.జె. డైరెక్ట్ చేస్తున్న చిత్రం “మిషన్ ఇంపాజిబుల్‌. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తాప్సీ ముఖ్య పాత్ర పోశిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం మలయాళీ నటుడు హరీశ్‌ పేర‌డీనీ తీసుకున్నట్టు చిత్ర బృందం అనౌన్స్ చేసింది. త‌న న‌ట‌న‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీశ్ మలయాళం, తమిళం చిత్రాల్లో ఎక్కువగా నటించారు. అయితే మహేశ్‌ బాబు హీరోగా ఎ.ఆర్‌. మురుగదాస్‌ తెరకెక్కించిన ద్విభాషా చిత్రం ‘స్పైడర్‌’తో తెలుగు ప్రేక్షకుల ముందు కనిపించిన హరీశ్ తొలిసారి ‘మిషన్ ఇంపాజిబుల్’ ద్వారా నేరుగా తెలుగు చిత్రంలో నటించబోతున్నారు.

సంబంధిత సమాచారం :