యంగ్ కమెడియన్ పై “మిఠాయి” దర్శకుడు సంచలన ఆరోపణలు !

Published on May 16, 2019 11:02 pm IST

స్టార్ కమెడియన్స్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా “మిఠాయి” మూవీని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ కుమార్ మహేష్ పై సంచలన ఆరోపణలు చేశారు. మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన “భరత్ అనే నేను” మూవీలో రాహుల్ రామకృష్ణ వెనుకబడిన ప్రాతానికి చెందిన ఓ పల్లెటూరి కుర్రాడిగా నటించిన సంగతి తెలిసిందే.

ఐతే ఈ మూవీ లో రాహుల్ రామకృష్ణ కి మహేష్ కి మధ్య మరికొన్ని సన్నివేశాలుండగా, రాహుల్ నటన ముందు తాను తేలిపోతాడన్న కారణంగా మహేష్ కావాలనే అతని సన్నివేశాలు తొలగింపచేసాడని రాహుల్ రామకృష్ణ చెప్పుకొని తిరుగుతుంటాడని.. రాహుల్ రామకృష్ణ స్వయంగా నాకు కూడా ఈ విషయం గురించి చెప్పాడని డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

సంబంధిత సమాచారం :

More