జనని, ఉయిరే లపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు – ఎంఎం కీరవాణి

Published on Nov 27, 2021 12:00 am IST


దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా, అజయ్ దేవగన్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన వస్తోంది. ముఖ్యం గా ఎంఎం కీరవాణి సంగీతం మ్యాజిక్ చేస్తుంది అని చెప్పాలి. తాజాగా జనని, ఉయిరే పాటలను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ పాట కి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. పాట ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ఎంఎం కీరవాణి సోషల్ మీడియా వేదిక గా ధన్యవాదాలు తెలిపారు. అంతేకాక తన పాటను కచ్చితత్వం తో అందించిన గాయకులకు థాంక్స్ తెలిపారు. గాయకులలో రమ్య బెహరా, శ్రీ సౌమ్య వారణాసి, నయన నాయర, హారిక నారాయణ్, సాహితీ చాగంటి, స్నిగ్ధా శర్మ, గోమతి అయ్యర్, అదితి భావరాజు, ML గాయత్రి, హేమచంద్ర, సాయిచరణ్, లోకేశ్వర్, PVNS రోహిత్ లు ఉన్నారు.

ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7 వ తేదీన భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :