బాలనాగమ్మ చిత్రాన్ని నిజమైన తెలుగు ఆణిముత్యం గా చెప్పుకోవచ్చు. ఈ చిత్రం విడుదలై 70 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే ఏడుగురు యువరాజులు ఏడుగురు యువరాణులని వివాహమాడతారు. మాంత్రికుడు అతి పిన్న వయస్కురాలైన యువరాణి ని బలవంతంగా ఎత్తుకోనిపోతాడు. ఆ యువరాణి కొడుకు కనిపించని చెట్టులో ఉన్న పిట్టని కనిపెట్టి మాంత్రికుడిని ఎలా చంపాడు అన్నదే చిత్ర కథ. పతాక సన్నివేశాలు రామాయణ మరియు మహాభారతాలను తలపిస్తాయి. ఈ చిత్రంలో బాల నాగమ్మగా కాంచనమాల నటించగా సంగు గా పుష్పవల్లి మరియు రేలంగి కూడా నటించారు. ఈ సినిమాకి అసలైన మాంత్రికుడు కెమెరామెన్ ఎమ్. ఇరానీ అని చెప్పుకోవాలి. ఇండియన్ సినిమాని సరికొత్త దారిలో తీసుకెళ్ళిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఈ చిత్రంలోని ఆన్ని శాఖలు సరిగా పనిచేయడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తరువాత మరిన్ని జానపద చిత్రాలు ఇంకా చాలా వచ్చాయి. ఈ చిత్రనికి గొప్ప దర్శకుడు కె.వి రెడ్డి (మాయా బజార్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జెమిని ఫిల్మ్స్ వారికీ కాసుల వర్షం కురిపించింది. బాలనాగమ్మ చిత్రం హిందీ కూడా నిర్మించగా మధుబాల హీరోయిన్ గా నటించగా మహానటి సావిత్రి గారు సంగు పాత్ర పోషించారు.
70 వసంతాలు పూర్తి చేసుకున్న బాలనాగమ్మ
70 వసంతాలు పూర్తి చేసుకున్న బాలనాగమ్మ
Published on Jan 29, 2012 9:18 PM IST
సంబంధిత సమాచారం
- ‘ది ప్యారడైజ్’ టీజర్ టైమ్ ఫిక్స్.. రక్తపాతం మొదలయ్యేది ఎప్పుడంటే..?
- ‘ది ప్యారడైజ్’ టీజర్ రన్ టైమ్ ఫిక్స్.. ఎంతంటే..?
- ‘కొరియన్ కనకరాజు’ పెయిడ్ ప్రీమియర్స్.. టికెట్ బుకింగ్స్ షురూ..!
- ఇండియన్ మార్కెట్ లో ‘స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ లేటెస్ట్ వసూళ్లు!
- ‘ఎపిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త డేట్ ఎప్పుడంటే..?
- ‘డిసి’ రన్ టైం రూమర్స్ కి చెక్ పెట్టిన మేకర్స్!
- ‘రామాయణ’లోకి ఇలా భాగమైన రాకీ భాయ్!
- ‘డ్రాగన్’ కోసం ల్యాండ్ అయ్యిన హీరో..!
- ‘ప్యారడైజ్’ నుంచి అవైటెడ్ సాంగ్ రిలీజ్ అప్పుడే?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- రామాయణ ట్రైలర్ సంచలన ఫీట్!
- ఆగస్టు మూవీ హంగామా: యష్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ టూ రాజమౌళి ‘వారణాసి’ అప్డేట్.. థియేటర్లలో ఏ వారం ఏ మూవీ?
- ‘విశ్వనాధ్ అండ్ సన్స్’పై నాగవంశీ ధీమా..!
- ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీ. ఎమన్నాడంటే..?
- ఓటిటి సమీక్ష: ‘ఉయిర్’ – తెలుగు డబ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ హాట్ స్టార్ లో
- OTT : 4 భాషల్లో ‘ఓ..! సుకుమారి’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పటినుంచంటే?
- OTT Releases This Week: లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి.. ఓటీటీలోకి వస్తున్న కొత్త సినిమాల ఫుల్ లిస్ట్!
- ‘ఇరుముడి’ ట్రైలర్ డేట్ లాకయ్యిందా?


