సూపర్ స్టార్ మహేష్ కి ప్రముఖుల పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ!

Published on Aug 9, 2021 12:18 pm IST


సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, ప్రేక్షకుల తో పాటుగా ప్రముఖులు, రాజకీయ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ దర్శకులు పరశురామ్ పెట్ల, హరీష్ శంకర్, అనీల్ రావిపూడి, శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని, సురేందర్ రెడ్డి మెహెర్ రమేష్, వెంకీ కుడుముల, శివ కుమార్ బి లు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా వెన్నెల కిషోర్, అడివి శేష్, అల్లరి నరేష్, సుధీర్ బాబు, రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, నవీన్ పోలిశెట్టి, సత్యదేవ్, విక్టరీ వెంకటేష్, సుశాంత్, మెగాస్టార్ చిరంజీవి, సందీప్ కిషన్, నారా రోహిత్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటుగా, రాజకీయ నాయకులు, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

పరశురామ్ దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుట్టిన రోజు బ్లాస్టర్ గా ఈ చిత్రం టీజర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :