గాయత్రి లో గాయత్రి పటేల్ పాత్ర హైలెట్ కానుంది !

గాయత్రి లో గాయత్రి పటేల్ పాత్ర హైలెట్ కానుంది !

Published on Feb 5, 2018 12:46 PM IST

మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేసిన సినిమా గాయత్రి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తండ్రి కూతుళ్ళ మద్య జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కింది. మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విష్ణు, శ్రియ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఈ సినిమాలో మోహన్ బాబు విలన్ గా చేసిన గాయత్రి పటేల్ పాత్ర సినిమాకు హైలెట్ కానుందని సమాచారం. డిఫరెంట్ షేడ్స్ లో ఉన్న ఈ పాత్రలో మోహన్ బాబు ప్రేక్షకులను అలరించబోతున్నాడు. తమన్ రీ రికార్డింగ్ సినిమాకు అదనపు ఆకర్షణ కానుందని తెలుస్తోంది. ఉత్ఖంటభరితమైన కథనంతో సినిమా ఆడియన్స్ ను మెప్పించబోతోంది. ఈ సినిమాతో పాటు అదే రోజు ఇంటిలిజెంట్ రానుంది. మరుసటి రోజు తొలిప్రేమ విడుదల కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు