‘సైరా’లో అనుష్క రోల్ అదేనట !

Published on May 14, 2019 6:36 pm IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తుది దశలో ఉంది. కాగా ఈ చిత్రంలో అనుష్క శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

అయితే అనుష్క ఈ సినిమాలో యాంకర్ గా కనిస్తోందట. సినిమా బిగినింగ్ లోనే అనుష్క ఎంట్రీ ఇస్తోందని.. ఆమె పాయింట్ ఆఫ్ లోనే ‘సైరా నరసింహారెడ్డి’ స్టోరీ మొదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్క పార్ట్ షూట్ జరుగుతుంది.

ఇక సైరా లో నయనతార కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నయన తార, విజయ్ సేతుపతి, సుధీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More