తమిళనాట అడుగుపెట్టనున్న జగపతి బాబు

తమిళనాట అడుగుపెట్టనున్న జగపతి బాబు

Published on Nov 29, 2011 3:40 PM IST

ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన జగపతి బాబు ఇప్పుడు తమిళ నాట అడుగుపెట్టబోతున్నాడు. విక్రమ్ హీరోగా రూపొందుతున్న ‘తాండవం’ చిత్రంలో జగపతి బాబు పవర్ఫుల్ విలన్ పాత్ర పోషించనున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో విక్రమ్ సరసన అనుష్క మరియు ఎమీ జాక్సన్ నటిస్తుండగా ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న తాండవం చిత్రాన్ని చెన్నై, డిల్లీ మరియు అమెరికాలో చిత్రీకరిస్తారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు