ప్రముఖ ల్యాబ్-గ్రోన్ డైమండ్ బ్రాండ్ ‘లాడియా’ (LADIA) నెల్లూరులో తన ఆరవ స్టోర్‌ను ఘనంగా ప్రారంభించింది. ఈ నూతన షోరూమ్‌ను ప్రముఖ సినీ నటి మానస వారణాసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరు, సాత్విక పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అఖిల్ వేములూరు మాట్లాడుతూ.. దేశంలో ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆభరణాలకు ప్రసిద్ధి చెందిన నెల్లూరులో తమ ఆరవ బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
అత్యాధునిక సాంకేతికతతో ప్రయోగశాలల్లో తయారయ్యే ఈ వజ్రాలు.. నాణ్యత, రంగు, మెరుపులో సహజ వజ్రాలకు ఏమాత్రం తీసిపోవు. IGI సర్టిఫికేషన్ ఉన్న ఈ వజ్రాల ధర క్యారెట్‌కు రూ.24,999 (EF – VVS) నుంచి ప్రారంభమవుతుంది. నెక్లెస్‌లు, హారాలు, వడ్డాణాలు, ఉంగరాలతో పాటు ప్రత్యేకమైన ల్యాబ్-గ్రోన్ పోల్కీ ఆభరణాలు ఇక్కడ లభిస్తాయి. కస్టమర్ల అభిరుచికి తగ్గట్లు డిజైన్లను కస్టమైజ్ చేసే సదుపాయం కూడా ఉంది.
స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లకు లాడియా బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఏప్రిల్ 04 నుంచి ఏప్రిల్ 19, 2026 వరకు వజ్రాల ధర మరియు మేకింగ్ ఛార్జీలపై 15% ఫ్లాట్ తగ్గింపుతో పాటు జీరో వేస్టేజ్ (No Wastage) ఆఫర్‌ను అందిస్తోంది.


