అదనపు సన్నివేశాలతో అలరించనున్న “మహర్షి”

Published on May 15, 2019 6:30 pm IST

“మహర్షి” మూవీ ప్రిన్స్ మహేష్ మరియు ఆయన ఫాన్స్ కి మరపురాని చిత్రంగా నిలపడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్ర నిర్మాతలు. తన ప్రతి సినిమా విడుదలైన తరువాత ఫ్యామిలీ తో విదేశాలకు వెకేషన్కి వెళ్లే అలవాటున్న మహేష్ ఈ సారి తన ట్రిప్ ని వాయిదా వేసుకున్నారంట. దానికి కారణం చిత్ర నిర్మాతలు కొన్నిరోజులు మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా మహేష్ ని కోరినట్లుగా సమాచారం.

అలాగే “మహర్షి” మూవీ గురించి మరొక వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే మహర్షి మూవీలో మరి కొన్ని కొత్త సన్నివేశాలు కలుపనున్నారని సమాచారం. మహేష్ మరియు అల్లరి నరేష్ పూజా హెగ్డేల మధ్య నడిచే కొన్ని కామెడీ సన్నివేశాలు జోడించనున్నారంట. ఐతే ఈ వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందో చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే వరకు వేచిచూడాల్సిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ ని దిల్ రాజు, అశ్వనీ దత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మించగా దేవిశ్రీ మ్యూజిక్ అందించారు. పూజా హెగ్డే మహేష్ సరసన నటించగా అల్లరి నరేష్ ఓ ముఖ్య పాత్రను చేయడం జరిగింది

సంబంధిత సమాచారం :

More