ముహూర్తం ఫిక్స్ చేసుకున్న నితిన్ కొత్త సినిమా !

ముహూర్తం ఫిక్స్ చేసుకున్న నితిన్ కొత్త సినిమా !

Published on Feb 27, 2018 11:07 AM IST

నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న ‘చల్ మోహన్ రంగ’ సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందించడం జరిగింది. టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంభందించిన డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా పూర్తయ్యాక ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా మార్చి 3న పూజా కార్యక్రమాలతో ప్రారంభంకానుంది. అదే నెల 23 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోనుంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రాశిఖన్నా, నందిత శ్వేతలు ఇందులో హీరోయిన్లు గా నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు