ఆడియో సమీక్ష : అరవింద సమేత – ఎమోషనల్ ఆల్బమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత ఆడియో కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని సాంగ్స్ ఎలావున్నాయో ఇప్పుడు చూద్దాం.

1. పాట : ఏడ పోయినాడో

గాయనీ గాయకులు : నికిత శ్రీవల్లి , కైలాష్ ఖేర్ , పెంచల్ దాస్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి, పెంచల్ దాస్

ఈచిత్రంలోని మొదటి పాట ఏడ పోయినాడో సీరియస్ సాగే ఈసాంగ్ మంచి ఫీల్ తెప్పించింది. తమన్ సంగీతంలో కైలాష్ ఖేర్ , నికిత శ్రీవల్లి ఈ సాంగ్ ను పాడారు. ఈ సాంగ్ ను తెర మీద చూసినప్పుడు ప్రేక్షకులు భావోద్వేగానికి గురికావడం ఖాయం.

2. పాట : అనగనగనగా
గాయనీ గాయకులు : అర్మాన్ మాలిక్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి

విశ్లేషణ : ఇక రెండవ సాంగ్ అనగనగనగా మంచి రొమాంటిక్ గా సాగుతూ సింపుల్ మ్యూజిక్ తో మనుసుకు హాయ్ గా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్లపై వచ్చే ఈసాంగ్ ఇప్పటికే పెద్ద హిట్ అయ్యింది. ఎలాంటి లౌడ్ సౌండ్ లేకుండా తమన్ ఈ సాంగ్ ను అద్భుతంగా కంపోజ్ చేశాడు.

3. పాట : పెనివిటి
గాయనీ గాయకులు : కాల భైరవ
రచన : రామజోగయ్య శాస్త్రి

ఈచిత్రంలోని మూడవ సాంగ్ పెనివిటి నిన్న విడుదలై మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఎమోషనల్ గా సాగె ఈ పాట కు ప్రేక్షకులు థియేటర్లలలో కన్నీళ్లు పెట్టుకోకుండా వుండరు అనిపిస్తుంది. రామజోగయ్య శ్రాస్తి లిరిక్స్ అద్భుతమనే చెప్పాలి. తమన్ కంపోజిషన్లో వచ్చిన ఈ సాంగ్ కొన్ని సంవత్సరాలు గుర్తిండిపోతుంది అనడంలో సందేహం లేదు.

4. పాట : రెడ్డి ఇక్కడ సూడు
గాయనీ గాయకులు : అంజనా సౌమ్య , దలేర్ మెహందీ
రచన : రామజోగయ్య శాస్త్రి

సినిమాలోని చివరి సాంగ్ రెడ్డి ఇక్కడ సూడు ఈ సాంగ్ పాత స్టయిల్లోనే సాగుతూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దలేర్ మెహేంది పాడిన ఈ పాట ఆర్డినరీ ట్యూన్స్ తో రొటీన్ గా అనిపిస్తుంది. ఎన్టీఆర్ డ్యాన్స్ కోసమే ఈ పాటను కంపోస్ చేసినట్టుగా వుంది. తెర మీద ఆయన వేసే స్టెప్పులు చుస్తే కాని ఈ పాట స్థాయి ఏంటో అర్ధం కాదు.

తీర్పు:

మొదటి సారి తమన్ – త్రివిక్రమ్ కలయికలో భారీ అంచనాలతో వచ్చిన ఈ ఆల్బమ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. కానీ మాస్ ప్రేక్షుకులకు మాత్రం ఈ ఆడియో అంత సంతృప్తిని ఇవ్వక పోవచ్చు. అన్ని సిట్యువేషనల్ సాంగ్స్ కావడంతో ఎన్టీఆర్ డ్యాన్స్ ను ఈ సినిమాలో చూశే అవకాశం చాలా తక్కువ. ఇది కూడా ఆయన అభిమానులకు నిరాశ కలిగించేదే. చివరగా తమన్ రొటీన్ ట్యూన్స్ తో కాకుండా కొత్తదనం తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అనగనగనగా ,పెనివిటి సాంగ్స్ ఈచిత్రం ఆడియో కి హైలైట్ గా నిలుస్తాయి.

Click here for English Music Review

సంబంధిత సమాచారం :