టాలెంట్ చూపడానికి రెడీ అయిన రాశీ ఖన్నా

Published on Jul 26, 2019 2:57 am IST

తెలుగులో అడపాదడపా హిట్లు పడినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన హీరోయిన్ రాశీ ఖన్నా. యువ స్టార్ హీరోలకు జోడీ కాగల గ్లామర్ ఉన్నప్పటికీ ఎందుకో అమె కమర్షియల్ సినిమా హీరోయిన్ కాలేకపోతోంది. చేతిలో రెండు తెలుగు సినిమాలున్నప్పటికీ ఆమె పేరును ప్రేక్షక వర్గాలు పెద్దగా తలచుకోవట్లేదు. అందుకే ఈసారి సినిమాతో గట్టిగా రిజిస్టర్ అయిపోవాలనుకుంటోంది ఈమె.

అలాకావాలంటే చేసే సినిమాలో తన మార్క్ స్పష్టంగా కనబడాలి. అందుకోసమే తన తర్వాతి ప్రాజెక్ట్ ‘వెంకీ మామ’లో తనదైన ముద్ర వేయడానికి నటనతో పాటు అందంతో కూడా ఆకట్టుకోవాలని బికినీ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయింది. గతంలో చేసిన ‘బెంగాల్ టైగర్’ చిత్రంలో బికినీ ప్రయత్నం చేసినా బొద్దుగా కనిపించడంతో పొగడ్తలకు బదులు విమర్శలు ఎదురయ్యాయి.

కాబట్టి ఈసారి బాగా బరువు తగ్గి స్లిమ్ లుక్ తెచ్చుకుంది. నాజూకు శరీరంతో సెగలు పుట్టించడానికి సిద్దమైంది. మరి ఆమె ఎఫర్ట్ ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి. వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :