పర్ఫెక్ట్ రీమేక్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ !

పర్ఫెక్ట్ రీమేక్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ !

Published on May 13, 2019 2:27 PM IST

arjunredddy dub

తెలుగులో సంచలన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని కూడా తెలుగు వెర్షన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. సాధారణంగా రీమేక్ అంటే ఒరిజినల్ వెర్షన్‌ను కొంచెం మార్పులు చేర్పులు చేసి చేస్తుంటారు చాలామంది దర్శకులు. అవి కొన్నిసార్లు విజయం సాధించినా చాలాసార్లు ఒరిజినల్ ఫ్లేవర్, ఫీల్ రెండూ మిస్సై బోల్తా కొడుతుంటాయి.

సందీప్ వంగ ఈ పొరపాటును చేయదల్చుకోలేదు. అందుకే తెలుగు భాషలో సినిమా ఎలా అయితే ఉందో అలాగే హిందీలో చేశారు. హీరో హీరోయిన్లు, ఇతర ముఖ్యమైన పాత్రల దగ్గర్నుండి సన్నివేశాల చిత్రీకరణ, లొకేషన్లు, నేపథ్య సంగీతం, కథలో ముఖ్యమైన కాన్‌ఫ్లిక్ట్స్‌, చివరికి డైలాగ్స్ అన్నీ ‘అర్జున్ రెడ్డి’లానే ఉండేలా జాగ్రత్తపడ్డారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. కేవలం నటీనటులు మారారు తప్ప ఇంకేం మారలేదు అనిపిస్తుంది. షాహిద్ కపూర్, కైరా అద్వానీలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

 

 

తాజా వార్తలు