తమిళ్ రీమేక్ 96 మూవీ షూటింగ్ త్వరలో పూర్తి చేయనున్న శర్వానంద్

Published on May 15, 2019 5:57 pm IST

తమిళ్లో ఘనవిజయం సాధించిన 96 మూవీ ని తెలుగులో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 50 శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం సినిమాలోని మేజర్ సన్నివేశాల చిత్రీకరణ కంప్లీట్ చేసిన చిత్రబృదం జులై చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారంట. తమిళ్ వెర్షెన్ 96 వలే తెలుగు వర్షన్ కూడా ఘనవిజయం సాధించడానికి కావలసిన అన్ని జాగ్రతలు తీసుకుంటుందంట చిత్ర బృందం.
ప్రస్తుతం షూటింగ్ విరామంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్ త్వరలో హీరోయిన్ సమంతతో ఉన్న రొమాంటిక్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడం ద్వారా షూటింగ్ తుదిదశకు చేరుతుంది. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More