‘పూజై’ కోసం కోయంబత్తుర్ బయలుదేరిన శృతి హాసన్

‘పూజై’ కోసం కోయంబత్తుర్ బయలుదేరిన శృతి హాసన్

Published on May 15, 2014 11:41 PM IST

Shruti-Haasan-heads-to-Coim
చిన్న విరామం తర్వాత శృతి హాసన్ తన తాజా తమిళ చిత్రం ‘పూజై’ షూటింగ్ లో పాల్గొంది. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో ఆమె విశాల్ సరసన నటిస్తుంది. మొదటి షెడ్యూల్ ని చెన్నై లో పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొన్ని రోజుల పాటు కోయంబత్తుర్ లో షూటింగ్ జరుపుకోనుంది.

ఈ యేడాది శృతి హాసన్ కి అద్బుతం గా ఉందనే చెప్పాలి. తను నటించిన రెండు చిత్రాలు ‘నాయక్’ ‘రేసుగుర్రం’ చాలా పెద్ద హిట్లు గా నిలిచాయి. తెలుగు లో వరుసగా విజయవంతమైన చిత్రాలలో నటించిన శృతి తమిళ మరియు హింది చిత్రాల షూటింగ్ లో బిజీ గా వుండడం వల్ల ప్రస్తుతం ఏ తెలుగు చిత్రాన్నిఅంగీకరించలేదు. శృతి ప్రస్తుతం ‘పూజై’ తో పాటు అనీస్ బజ్మీజ్ దర్శకత్వం వహిస్తున్న ‘వెల్కమ్ బ్యాక్’ చిత్రం లో నటిస్తుంది.

శృతి ‘వెల్కమ్ బ్యాక్’ చిత్రం తర్వాత తిగ్మంషు దులియా దర్శకత్వం వహిస్తున్న ‘బిచ్డే సబి బారి బారి’ అనే చిత్రం లో ద్విపాత్రాభినయం చేస్తుంది. ఆ రెండు పాత్రల్లో ఒకటి ముదుసలి పాత్ర కావడం విశేషం.

తాజా వార్తలు