“క్యాష్” స్టేజ్ పై సీనియర్ నటుల సరదా సందడి.!

Published on Jul 25, 2021 12:40 pm IST


మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై నెవర్ ఎండింగ్ ఎంటర్టైన్మెంట్ ని అందించే ఛానెల్ ఏదన్నా ఉంది అంటే అది ఈటీవీ అనే చెప్పాలి. వారంలో ప్రతీ రోజు కూడా ఆసక్తికర ఎంటర్టైనింగ్ షో తో తెలుగు ఆడియెన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్స్ ను అందిస్తున్నారు. మరి అలా ప్రతి శనివారం సుమ యాంకరింగ్ లో ప్రసారం అయ్యే “క్యాష్” షో కూడా ఒకటి. మన టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులతో అదిరే ఎంటర్టైన్మెంట్ సాగే ఈ షోకి వచ్చే ఎపిసోడ్ లో ప్రత్యేక అతిథులుగా సీనియర్ నటులు బాబు మోహన్, గౌతమ్ రాజు, రాజ్యలక్ష్మి, శివ పార్వతిలు వచ్చారు.

మరి ఎప్పటి నుంచో తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న వీరు క్యాష్ స్టేజ్ పైకి వచ్చి మళ్ళీ పాత రోజులని గుర్తు చేయడమే కాకుండా తమ తమ మ్యానరిజమ్స్ తో అదిరే ఎంటర్టైన్మెంట్ ని కూడా అందించారు. మరి ఈ సరికొత్త ఎపిసోడ్ లో వారు ఇంకెంత వినోదాన్ని అందించి సందడి చేసారో తెలియాలి అంటే వచ్చే జూలై 31న ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ఈ షోని మిస్సవ్వకుండా చూడాల్సిందే.

ఆ ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

 

సంబంధిత సమాచారం :