మహేశ్ బాబునే నమ్ముకున్న హీరో !

Published on Apr 28, 2019 8:16 pm IST

మహేశ్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రాబోతోన్న ‘మహర్షి’ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ అభిమానులు ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఇప్పటికే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఫ్యాన్స్ తో పాటు ఓ హీరో కూడా మహేష్ తనకు హిట్ ఇస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఆ హీరోనే అల్లరి నరేష్. ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలంటే.. మినిమమ్ గ్యారింటీ లేదా హిట్ అన్నంతగా ప్రేక్షకులు ఈ కామెడీ హీరోని ఆదరించారు.

కానీ గత కొన్నేళ్లుగా మాత్రం అల్లరి నరేష్ వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు. అందుకే నరేష్ హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం మహర్షిలో నరేష్ మహేశ్ బాబు ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. కాగా నరేష్ పాత్ర సినిమాలో కొంతసేపే ఉన్నా.. కథలో చాలా కీలకంగా ఉంటుందట. అలాగే సినిమాలో మహేష్ – నరేష్ మధ్య ఫ్రెండ్ షిప్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా హైలైట్ గా నిలుస్తాయట. మరి అల్లరి నరేష్ కి మహేష్ బాబు అన్నా హిట్ ఇస్తాడేమో చూడాలి.

కాగా మహర్షిలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ కామెడీ హీరో అల్లరి నరేష్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :