నాగార్జున కలల చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న విక్రం కుమార్?

Published on Mar 23, 2012 1:22 am IST

“ఇష్క్” చిత్ర దర్శకుడయిన విక్రం కుమార్ నాగార్జున కలల చిత్రం మూడు తరాలు కలిసి నటించబోయే చిత్రంకి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వర రావు ,నాగార్జున మరియు నాగ చైతన్య ఇలా మూడు తరాలు తెర మీద కనిపించబోతున్న ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో నాగార్జున ఈ చిత్రానికి కథలు వింటున్నాం అని చెప్పారు. ఆయనకు కథలు చెప్పిన వారిలో విక్రం కుమార్ ఒకరు ఇష్క్ చిత్ర కథానాయకుడు నితిన్ చూచాయిగా ఈ చిత్రానికి విక్రం కుమార్ దర్శకత్వం వహించాబోతున్నారని చెప్పారు. ట్విట్టర్ లో నితిన్ ఇలా పేర్కొన్నారు ” నా చిత్ర దర్శకుడు విక్రం కుమార్ తరువాతి చిత్రం మల్టీ స్టారర్ చిత్రం ఈ చిత్రంలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల కథానాయకులు కనిపించడం నాకు చాలా ఆనందం కలిగిస్తున్న విషయం” అని చెప్పారు. నితిన్ ఈ ట్వీట్ లో అక్కినేని కథానాయకుల గురించి ప్రస్తావించకపోయినా పరిశ్రమ వర్గాల ప్రకారం ఈ ట్వీట్ అక్కినేని వంశానికి సంభందించిన విషయమే . ఇష్క్ చిత్ర విజయం తరువాత విక్రం కుమార్ ఈ చిత్రం చెయ్యటం మూలాన చిత్రం మీద మరిన్ని అంచనాలు పెంచుతాయి. అధికారిక ప్రకటన త్వరలో చేయనున్నారు.

సంబంధిత సమాచారం :