మోహన్ బాబు, అల్లరి నరేష్‌ల కాంబినేషన్‌లో సినిమా!

మోహన్ బాబు, అల్లరి నరేష్‌ల కాంబినేషన్‌లో సినిమా!

Published on Jun 27, 2015 1:44 PM IST

allari-naresh-mohan-babu
తన విలక్షణ నటనతో, కామెడీ టైమింగ్‌తో తెలుగు సినీ పరిమశ్రమలో గొప్ప గుర్తింపు సంపాదించుకున్న నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఇక ఈతరంలో తనదైన కామెడితో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టి నవ్వించే కామెడీ స్టార్ అల్లరి నరేష్. వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే ఆసక్తికరంగా ఉంది కదూ! త్వరలోనే ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చనుంది. మోహన్ బాబు, అల్లరి నరేష్‌ల కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా ప్రారంభం కానుంది.

అటు హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ విభిన్న సినిమాలను రూపొందిస్తూ వస్తున్న మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’, ‘ఢమరుకం’ వంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందని నిర్మాత మంచు విష్ణు సినిమా అనౌన్స్‌మెంట్ సందర్భంగా తెలిపారు.

తాజా వార్తలు