
దాదాపు వారం క్రితం రామానాయుడుగారిని కలిశాను. ఆయన ఆరోగ్య స్థితి చూసి, కలత చెందాను. రామానాయుడిగారితో నాది 35 ఏళ్ల అనుబంధం. రామనాయుడిగారి సంస్థలో నేను సుమారు పది చిత్రాల్లో నటించాను. వాటిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన చిత్రం ‘దేవత’. ఇంకా బ్రహ్మపుత్రుడు, కూలీ నం. 1.. ఇలా మంచి చిత్రాలు చేశాను. ఏ నటుడికైనా నిర్మాతే దేవుడు. ఒక నిర్మాత ఎలా ఉండాలి? అనేది ఆయన్ను చూసే తెలుసుకున్నాను. సెంటిమెంట్స్ కి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి. నేను హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నప్పుడు నాకెంతో ఆప్తులైన నా గురువు దాసరిగారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, రామానాయుడుగార్లను సతీ సమేతంగా ఆహ్వానించాను. తెల్లవారు జాము ఐదు గంటలకు గుమ్మం పెట్టాం. అప్పుడు నిండు మనసుతో అందరూ మా కుటుంబాన్ని దీవించారు. వృత్తిపరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా రామానాయుడుగారు నాకెంతో ఆప్తులు. మంచి స్నేహశీలిని పోగొట్టుకున్నాను. ఆయన మరణం తెలుగు సినిమా పరిశ్రమకే కాదు.. భారతీయ చలన చిత్రసీమకు తీరని లోటు.
రామానాయుడుగారు మంచి స్నేహశీలి – డా. మోహన్ బాబు
రామానాయుడుగారు మంచి స్నేహశీలి – డా. మోహన్ బాబు
Published on Feb 18, 2015 7:48 PM IST
సంబంధిత సమాచారం
- బాలయ్య-కొరటాల మూవీ.. మహేష్ బాబునే ఫాలో అవుతారా..?
- ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ టాక్ : ట్రంప్ దెబ్బకు అల్లాడుతున్న తరుణ్ భాస్కర్..!
- ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఛేజింగ్: 264 టార్గెట్.. 18.5 ఓవర్లలోనే ఫినిష్.. పంజాబ్ కింగ్స్ వీరవిహారం చూశారా?
- చిరు-బాబీ మూవీపై సరికొత్త బజ్.. రంగంలోకి మరొకరు..?
- డార్లింగ్ రీ-రిలీజ్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు సంతోషంతో పాటు బాధ కూడా..!
- ఎన్టీఆర్-నీల్ రిలీజ్ పై సరికొత్త చర్చ.. మరీ ఏడాది వెనక్కి ఎందుకు..?
- డే 2 తెలుగులో ‘వాలా 2’కి సాలిడ్ రెస్పాన్స్!
- ఫాంటసీ థ్రిల్లర్ ‘రాకాస’ ఓటిటి డేట్ లాక్?
- పూరీ ‘స్లమ్ డాగ్’ పరిస్థితేంటి?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : వాలా 2 – ఆకట్టుకునే యూత్ ఫుల్ డ్రామా
- సమీక్ష : మైఖేల్ – డీసెంట్‌గా సాగే పాప్ కింగ్ బయోపిక్
- సమీక్ష : పరమపద సోపానం – రెగ్యులర్ క్రైమ్ యాక్షన్ డ్రామా!
- ఆల్ టైం రికార్డ్స్ తో మొదలైన ‘డార్లింగ్’ వసూళ్లు!
- ‘రామాయణ’లో రావణ పాత్రే ఎందుకు? రాకింగ్ స్టార్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్!
- SSR61 టైటిల్, టీజర్ వచ్చేస్తోంది..!
- నితిన్ సరసన యంగ్ బ్యూటీ లాక్.. కెమిస్ట్రీ పైనే అందరి చూపులు..!
- యాడ్ తెచ్చిన ముచ్చట.. సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ కుదిరేనా..?

