బాలయ్యపై మోహన్ బాబు హాట్ కామెంట్స్ వైరల్.!

Published on Oct 14, 2021 4:40 pm IST


గత రెండు మూడు వారాల నుంచి టాలీవుడ్ లో మా ఎన్నికల ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలు ముగిసిపోయినప్పటికీ కూడా ఇంకా ఈ ఎన్నికల ట్రాన్స్ లోనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రధాన పోటీదారులు మంచు విష్ణు అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్స్ నడుమ జరిగిన రసవత్తర పోటీలో ఎట్టకేలకు మంచు విష్ణునే గెలుపొందాడు.

అయితే ఈ ఎన్నికలకు ముందు విష్ణు వెళ్లి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ దగ్గరకి వెళ్లి తన మద్దతు కోరి మరీ తనకి ఓట్ చేయించుకున్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ గెలిచాక విష్ణు మరియు మోహన్ బాబు లు బాలయ్యను కలిసి విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం పిలవడానికి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా బాలయ్య కోసం మోహన్ బాబు మాట్లాడిన హాట్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

‘పొలిటికల్ గా తాను గతంలో బాలకృష్ణ అల్లుడిని ఓడించడానికి నేను ప్రచారం చేశాను. కానీ ఈ ఎన్నికల సమయంలో మద్దతు కోసం అడగ్గా గతం ఏమీ ఆలోచించకుండా వచ్చి ఓట్ చేసి విష్ణు కోసం మద్దతుగా నిలబడ్డారు. అంతటి సంస్కారం బాలకృష్ణకి ఉందని’ మోహన్ బాబు కొనియాడారు. దీనితో మోహన్ బాబు చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :