చిరుకి మోహన్ బాబు ఆత్మీయ ఆహ్వానం

Published on Mar 26, 2020 11:07 am IST

రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నట్లు గ్రాండ్ గా ప్రకటించారు. ఓ వీడియో సందేశం ద్వారా ఇకపై సోషల్ మీడియాలో తన భావాలు, ఆలోచనలు ఫ్యాన్స్ తో పంచుకకోనున్నట్లు తెలియజేయడం జరిగింది. కాగా నిన్న ఉదయం 11:11 నిమిషాలకు చిరంజీవి ట్విట్టర్ అకౌంట్ నుండి ఓ ట్వీట్ రావడం జరిగింది. మొదటి ట్వీట్ గా ఆయన అభిమానులకు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

ఇక చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీని టాలీవుడ్ సాదరంగా ఆహ్వానించింది. ఆయనకు సినీ ప్రముఖులు వెల్కమ్ తెలిపారు. మహేష్ వంటి స్టార్ హీరోలు సైతం మెగాస్టార్ సోషల్ మీడియా ఎంట్రీకి స్వాగతం పలికారు. కాగా నేడు మోహన్ బాబు ఆయనకు ఆత్మీయ ఆహ్వానం తెలిపారు. మిత్రమా వెల్ కమ్ అని ఆయన ట్వీట్ చేశారు. కొంత కాలంగా చిరకాల మిత్రులైన చిరంజీవి, మోహన్ బాబు సిన్నిహితంగా ఉంటున్నారు.

సంబంధిత సమాచారం :

More