యాండ్రాయుడు వేదికపై పెదరాయుడు…!

Published on Aug 7, 2019 2:37 pm IST

నేడు హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ హాలులో సంపూర్ణేష్ బాబు నటించిన “కొబ్బరిమట్ట” ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈనెల 10న ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ నేడు గ్రాండ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. ఐతే ఈ కార్యక్రమానికి ఓ విశేష అతిధి హాజరుకానున్నారు. ఆయనెవరో కాదు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.

ఈ విషయాన్ని ధృవీకరిస్తూ హీరో సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేయడం జరిగింది. “నాలాంటి ఒక చిన్న నటుడిని అడిగిన వెంటనే మా ప్రిరిలీజ్ ఫంక్షన్ కి ఆశీర్వదించటానికి విచ్చేస్తున్న మా రియల్ పెదరాయుడు మోహన్ బాబు గారికి నా పాదాభివందనం” అని మోహన్ బాబుకి సంపూ కృతజ్ఞత తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో సంపూ పాపారాయుడు,పెదరాయుడు,యాండ్రాయుడు అనే మూడు విభిన్న పాత్రలు చేశారు.

స్టీవ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాయి రాజేష్ నీలం నిర్మిస్తున్నారు. నటి షకీలా, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఇతర ముఖ్యపాత్రాలలో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :