44 ఏళ్ల తరువాత మోహన్ బాబు మళ్ళీ మరొక మారు.

Published on Jun 13, 2019 2:57 pm IST

ప్రతినాయకుడిగా తెలుగు తెరపై తన ప్రస్థానం మొదలుపెట్టిన మోహన్ బాబు తన టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి హీరో అయ్యారు. 90వదశకంలో వరుస విజయాలతో ఆయన కలెక్షన్ కింగ్ అనే స్టార్ హోదా పొందారు. 500 లుపైగా చిత్రాలలో నటించిన నటుడిగా తెలుగు పరిశ్రమలో రికార్డు నెలకొల్పిన మోహన్ బాబు సుధీర్ఘమైన సినీ ప్రయాణంలో ఆయన చేయని పాత్రలేదు.

‘సాలా కదూస్‌’ మూవీని కి దర్శకత్వం వహించిన సుధా కొంగర సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ అనే ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులోఓ పాత్ర సినిమాకి చాలా కీలకం కావడంతో, మోహన్ బాబు గారైతే దీనికి న్యాయం చేయగలరని భావించిన చిత్ర యూనిట్ మోహన్ బాబు ని సంప్రదించారట. దీనికి సానుకూలంగా స్పందించిన మోహన్ బాబు చివరికి నటించడానికి ఒప్పుకున్నారట.

రేపు చెన్నై ఎయిర్ పోర్ట్ లో జరగనున్న షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొనడానికి మోహన్ బాబు నిన్న చెన్నై వెళ్లారట. మరో విశేషం ఏమిటంటే 44 ఏళ్ల తరువాత ఆయన ఓ లేడీ డైరెక్టర్ సారధ్యంలో నటిస్తున్నారు. గతంలో కృష్ణ హీరో గా విజయ నిర్మల దర్శకత్వం వహించిన మూవీలో ఆయన విలన్ గా నటించారు. మోహన్ బాబు, సూర్య సినిమాలో చేస్తున్నారని వార్తలు రావడంతో ఈ మూవీ పై అంచనాలు పెరిగి పోయాయి.

సంబంధిత సమాచారం :

More